యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jul 1, 2022 10:08 am IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” తో ఎలాంటి హిట్ అందుకున్నాడో తెలిసిందే. అలాగే ఈ సినిమా అనంతరం యష్ ఎలాంటి సినిమాలు చేస్తాడు కేజీయఫ్ రేంజ్ ని అందుకునే లైనప్ ని సెట్ చేస్తాడా లేదా అనేది చాలా ఆసక్తిగా మారాయి. అయితే ఇంకా ఏ దర్శకునితో సినిమా చేస్తున్నాడు అనే ఇతర అంశాలు ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

కానీ ఇప్పుడు ఆల్ మోస్ట్ మన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా అయితే కన్ఫర్మ్ అయ్యిపోయింది తెలుస్తుంది. అలాగే దీనికి దర్శకుడు ఎవరు అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే దానిపై చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరి యష్ అయితే ఎలాంటి సినిమా చేస్తాడో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :