మెగాస్టార్ మాస్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో..!

Published on May 25, 2022 12:32 pm IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాటిలో కొన్ని రీమేక్ సినిమాలు ఉండగా కొన్ని స్ట్రెయిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న క్రేజీ మాస్ సినిమా వాల్తేర్ వీరయ్య కూడా ఒకటి. మరి కంప్లీట్ గా ఫ్రెష్ సబ్జెక్టు తో మెగాస్టార్ మాస్ ఇమేజ్ ని మ్యాచ్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తోంది.

ఈ సినిమాలో చిరు ఒక మత్స్యకార నాయకుడిగా కనిలించనుండగా ఆ నేపథ్యంలో చేపలు గ్లోబల్ గా ఆ వ్యాపారంకి సంబంధించిన నేపథ్యంలో కనిపోయిస్తుందట. అందుకే విదేశాల్లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉండగా అందులో భాగంగా మలేసియా కి చిత్ర యూనిట్ ప్రయాణం అవ్వనున్నారట. అక్కడ కొన్ని రోజులు షూటింగ్ అనంతరం మళ్లీ ఇక్కడికి రానున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణమ్ వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :