ప్రభాస్ “సలార్” షూట్ ప్రోగ్రెస్ పై లేటెస్ట్ ఇన్ఫో..!

Published on Jun 2, 2022 10:00 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “సలార్” కోసం అందరికీ తెలిసిందే. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండియాన్ సినిమా దగ్గర కేజీయఫ్ సినిమాలను మించి క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ లా ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ లెవెల్ మాస్ ని ప్రభాస్ లాంటి ఊర మాస్ కటౌట్ పై చూస్తే ఆడియెన్స్ కి వచ్చే ఆ హై వేరే లెవెల్లోనే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇన్ని అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది.

ఈ బిగ్ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కేవలం 35 శాతం మాత్రమే తెరకెక్కిందట. అయితే రానున్న రోజుల్లో మాత్రం శరవేగంగా కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ ఈ సినిమా కోసం తన టైమింగ్స్ ని ప్లాన్ చేసుకున్నాడని ఆ ప్రకారం షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని తెలుస్తోంది. ఇక ఈ భారీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :