“ఖైదీ 2” పై వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ వార్తలు.!

Published on Jun 12, 2022 12:00 pm IST

కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయినటువంటి చిత్రాల్లో సైలెంట్ గా వచ్చి వైలెంట్ హిట్ అయ్యిన చిత్రం “ఖైదీ” కూడా ఒకటి. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ మరియు హీరో కార్తీ ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు లోకేష్ తెరకెక్కించిన మరో భారీ హిట్ “విక్రమ్” కి దీనికి లింక్ చేస్తూ చూపించడంతో ఆడియెన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు.

దీనితో పాటుగా ఇప్పుడు విక్రమ్ 2 కన్నా ముందు ఖైదీ 2 పై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. మరి ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపిస్తున్నాయి. ఈ సినిమా అయితే ఫస్ట్ పార్ట్ కన్నా పదింతలు సాలిడ్ గా ఉంటుందట.

అంతే కాకుండా దీనిని నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ సినిమాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా మాసివ్ గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుంది. బడ్జెట్ కూడా భారీ పెట్టనున్నట్టు టాక్. అలాగే ఈ చిత్రాన్ని లోకేష్ నెక్స్ట్ విజయ్ తో చేసే సినిమా అనంతరం స్టార్ట్ చేయనున్నాడట.

సంబంధిత సమాచారం :