ప్రభాస్ రెండో క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

ప్రభాస్ రెండో క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Dec 12, 2022 7:00 AM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లో ప్రభాస్ సెకెండ్ క్యారెక్టర్ రివీల్ అవుతుందట. సినిమా మొత్తంలోనే ఈ క్యారెక్టర్ ఎంట్రీ సీన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో డబుల్ రోల్ లో నటిస్తున్నాడని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో తాత పాత్రలో సంజయ్ దత్ నటించబోతున్నాడట.

మొత్తానికి దర్శకుడు మారుతి ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నాడు. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు