పవన్ ఈ సినిమా హడావుడి లేకుండానే.?

పవన్ ఈ సినిమా హడావుడి లేకుండానే.?

Published on Dec 17, 2022 8:30 PM IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు క్రిష్ తో భారీ చిత్రం “హరిహర వీరమల్లు” ఆల్రెడీ సెట్స్ మీద ఉండగా నెక్స్ట్ అయితే మరో రెండు చిత్రాలు అధికారికంగా అనౌన్స్ అయ్యాయి. ఇవి కూడా త్వరగానే కంప్లీట్ కానుండగా ఈ చిత్రాలతో పాటుగా ఓ రీమేక్ అయితే చేయనున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండగా పవన్ అయితే గెస్ట్ రోల్ లో నటించనున్నారు.

అయితే ఈ చిత్రంపై లాంచ్ అవ్వడం కూడా ఎలాంటి అనౌన్సమెంట్ రాలేదు. మరి వచ్చే జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా జరిగిపోనున్నట్టుగా ఇప్పుడు టాక్ బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు మరో టాక్ ఏమిటంటే ఈ సినిమాపై మరో అప్డేట్ హడావుడి ఏది కూడా లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసేస్తారని తెలుస్తుంది. తర్వాత మిగతా అప్డేట్స్ తో అయితే సినిమాని ప్లాన్ చేసుకోనున్నారని టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు