“పుష్ప 2” రిలీజ్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on May 19, 2022 11:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “పుష్ప”. పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ హిట్ గా 2021లో నిలిచిన ఈ చిత్రం మిగతా అనేక అంశాల్లో అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ ని అందుకుంది అని చెప్పాలి.

ఇక దీనితో ఈ సినిమా సీక్వెల్ “పుష్ప ది రూల్” కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా అయితే దర్శకుడు సుకుమార్ పుష్ప 2 రిలీజ్ పై ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం అయితే ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది 2023 డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా పార్ట్ 1 కన్నా భారీ స్థాయిలో ఉంటుంది అని కూడా తెలుస్తుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మరియు సాంగ్స్ కూడా లాక్ అయ్యినట్టు టాక్ ఉంది. ఇక ఈ సినిమా బ్లాస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :