ప్రభాస్ ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అప్పటి నుంచి మొదలు.!

Published on May 31, 2022 7:30 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వాటిలో కొన్ని పాన్ ఇండియా లెవెల్ నుంచి వరల్డ్ స్థాయి వరకు షూటింగ్ లో ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలతో పాటుగా దర్శకుడు మారుతి తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఒక హారర్ కమ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను మారుతి ప్లాన్ చెయ్యగా..

ఇప్పుడు దీనిపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి మొత్తం సిద్ధం అయ్యిందని. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ షూటింగ్ ఈ సెప్టెంబర్ నుంచే మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యిందని దీనిపై అధికారిక అప్డేట్ రాబోతుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ఇతర వివరాలు మున్ముందు బయటకు రానున్నాయి.

సంబంధిత సమాచారం :