ప్రభాస్ “సలార్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!

Published on Jun 26, 2022 3:00 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కోసం అందరికీ తెలిసిందే. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై రీసెంట్ గా నటుడు పృథ్వీ కూడా పలు కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూట్ కి సంబంధించి అయితే లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఈ జూన్ 28 నుంచి స్టార్ట్ కాబోతుండగా ఇది కూడా హైదరాబాద్ లోనే స్టార్ట్ అవనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆలాగే హోంబలే ఫిలింస్ వారు భారీ బడ్జెట్ తో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ లో అలా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :