“హరిహర వీరమల్లు” షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.!

Published on Mar 31, 2022 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కుతుంది.

మరి దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం కాస్త నెమ్మదిగానే కొనసాగుతుంది అని చెప్పాలి. కాకపోతే జాయిన్ అయ్యినపుడు మాత్రం శరవేగంగా షెడ్యూల్స్ కంప్లీట్ అవుతున్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ కి రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ చిత్రం షూట్ ఏప్రిల్ 6 నుంచి మొదలు కానున్నట్టు టాక్. అలాగే ఈ షెడ్యూల్ కోసం కూడా భారీ సెట్టింగ్స్ ని మేకర్స్ సిద్ధం చేసినట్టు కూడా వినికిడి. వీటితో పాటుగా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :