“ఇండియన్ 2” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.!

Published on Mar 5, 2023 2:00 pm IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా కాజల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు కీలక పాత్రల్లో ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఇండియన్ 2” కోసం తెలిసిందే. ఎప్పుడు నుంచో ప్లాన్ చేసిన ఈ భారీ సినిమా ఇప్పుడు అయితే శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుస్తున్నాయి.

ప్రస్తుతం శంకర్ అయితే ఓ నైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారట. కేవలం రాత్రి షూటింగ్ లోనే గత కొన్ని రోజులు నుంచి ఓ సీక్వెన్స్ అయితే ఇప్పుడు చేస్తున్నారట. అలాగే సినిమా టోటల్ షూటింగ్ ని శంకర్ జూలై నాటికి కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాని దీపావళి కానుకగా నిలపాలని చూస్తున్నట్టుగా లేటెస్ట్ సమాచారం.

సంబంధిత సమాచారం :