“సర్కారు వారి పాట” పై లేటెస్ట్ అప్డేట్స్ ఇవే.!

Published on Apr 22, 2022 5:06 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మే 12న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇక ఇదిలా ఉండగా రేపు ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ టైటిల్ ట్రాక్ రిలీజ్ అవుతుండగా ఇప్పుడు సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమాలో రేపు రిలీజ్ అవుతున్న సాంగ్ కాకుండా లాస్ట్ లో ప్లాన్ చేసిన మాస్ డ్యూయెట్ తాలూకా షూట్ తాజాగా కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది. దీనితో సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిందట. ఇక అలాగే రేపటి సాంగ్ విషయానికి వస్తే ఇది కూడా సాలిడ్ గా ఉంటుంది అట. ఇది వరకు థమన్ మరియు మహేష్ ల కాంబో నుంచి వచ్చిన ఇంట్రో సాంగ్స్ కి ధీటుగా ఈ సాంగ్ సూపర్ గా ఉంటుంది టాక్. మరి ఈ క్రేజీ నెంబర్ ఎలా ఉంటుందో తెలియాలి ఆంటే రేపటి వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :