‘పుష్ప ది రూల్’ రిలీజ్ పై లేటెస్ట్ ఇంట్రస్టింగ్ బజ్

Published on Mar 2, 2023 1:01 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీ పై తెలుగుతో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప ది రూల్ నుండి ఫస్ట్ లుక్ ని ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనుండగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట. నిజానికి 2024 సంక్రాంతికి రిలీజ్ చేద్దాం తొలుత భావించిన యూనిట్, అప్పటికే పలు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండడంతో పక్కాగా మార్చి చివర్లో లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఫహాద్ ఫాసిల్ నెగటివ్ రోల్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై యూనిట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :