లేటెస్ట్ : మహేష్ 29 పై ఇంట్రస్టింగ్ న్యూస్

Published on Jun 8, 2023 12:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. జూన్ 12 నుండి నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 జనవరి 13 న విడుదల కానుంది. ఇక దీని అనంతరం రాజమౌళి తో గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ మూవీ SSMB 29 లో నటించనున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ యొక్క స్టోరీ, స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు.

కొన్ని వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ మీడియా వర్గాల్లో బజ్ గా మారింది. దాని ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు మరియు ఖన్స్ లో ఒకరైన అమీర్ ఖాన్ ఇందులో విలన్ గా నటించనున్నారని అంటున్నారు. నిజానికి ఇంకా స్క్రిప్ట్ దశ లోనే ఉన్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని తెలుస్తోంది. కాగా త్వరలో మేకర్స్ నుండి SSMB 29 కి సంబంధించి అధికారికంగా అనౌన్స్ మెంట్ రానుంది. దాని అనంతరం ఇందులో ఎవరెవరు నటీనటులు యాక్ట్ చేయనున్నారు అనేవి కూడా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :