లేటెస్ట్: “కల్కి” ప్రీరిలీజ్ లో మొదటి చాప్టర్ వేదిక సమయం లాక్

లేటెస్ట్: “కల్కి” ప్రీరిలీజ్ లో మొదటి చాప్టర్ వేదిక సమయం లాక్

Published on Jun 19, 2024 10:14 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) లాంటి భారీ తారాగణం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి కూడా క్లారిటీలు కోరుకుంటున్నారు.

అయితే ఈ సినిమా ఈవెంట్ ఒకటి ముంబై లో ఉంటుంది అని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ అందించారు. కల్కి ప్రీ రిలీజ్ చాప్టర్ ముంబై అంటూ ఈరోజు సాయంత్రం 6 గంటలకి గ్రాండ్ ఈవెంట్ జరగబోతున్నట్టుగా రివీల్ చేశారు. అలాగే ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి ఉంటుంది అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఇక్కడ చాప్టర్ అని పెట్టారు అంటే మరిన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లు వరుసగా రాబోతున్నాయ్ అని అర్ధం చేసుకోవచ్చు. ఇక వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు