లేటెస్ట్ : ఆడియన్స్ కి ‘కల్కి 2898 ఏడి’ టీమ్ హెచ్చరిక

Published on Sep 21, 2023 3:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ ప్రాజక్ట్స్ లో నాగ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి కూడా ఒకటి. ఈ మూవీని అత్యంత భారీ వ్యయంతో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని వంటి వారు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కల్కి 2898 మూవీ టీమ్ ఆడియన్స్ కి ఒక హెచ్చరికని తాజాగా అఫీషియల్ గా జారీ చేసింది.

దాని ప్రకారం తమ కల్కి 2898 ఏడి మూవీ కి సంబంధించి ఎటువంటి సన్నివేశాలు, సంగీతం, ఫుటేజ్, స్టిల్‌లు, ఫోటోలు, న్యూస్ వంటివి ఎవరైనా సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదా లీక్ చేయడం వంటివి చేస్తే వారిపై సైబర్ క్రైమ్ చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇటీవల పలు సినిమాల నుండి ఫోటోలు, సాంగ్స్, వీడియోలు వంటివి లీక్ అవుతుండడంతో కల్కి 2898 ఏడి టీమ్ ఈ గట్టి నిర్ణయం తీసుకుంది. ఇది మంచి నిర్ణయం అని, ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే లీక్స్ కి అడ్డుకట్ట వేయొచ్చని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :