“బింబిసార” సెన్సేషన్..తెలుగు స్టేట్స్ లో 2 రోజుల వసూళ్ల వివరాలు..!

“బింబిసార” సెన్సేషన్..తెలుగు స్టేట్స్ లో 2 రోజుల వసూళ్ల వివరాలు..!

Published on Aug 7, 2022 2:03 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “బింబిసార” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ సాలిడ్ స్కేల్ చిత్రం మొదటి రోజు నుంచే సాలిడ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర చాలా కాలం తర్వాత మంచి ఓపెనింగ్స్ అందుకొని అదరగొట్టింది. ఇక ఈ చిత్రం మొదటి రోజే కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా.. ఇప్పుడు రెండు రోజులకి కలిపి ఆల్ మోస్ట్ బ్రేకీవెన్ కి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రెండో రోజు ఏరియాల వారీగా చూస్తే..

నైజాం – 1.77 కోట్లు (జి ఎస్ టి కలిపి)
వైజాగ్ – 65 లక్షలు (జి ఎస్ టి కలిపి)
సీడెడ్ – 95 లక్షలు
కృష్ణ – 25 లక్షలు
గుంటూరు – 32 లక్షలు
నెల్లూరు – 11 లక్షలు
తూర్పు గోదావరి – 27 లక్షలు
పశ్చిమ గోదావరి – 18 లక్షలు
రెండో రోజు మొత్తం – 4.50 కోట్లు ఈ చిత్రం వసూలు చేసింది.

ఏపీ తెలంగాణాలో ఈ చిత్రం 13 కోట్లకు పైగా బిజినెస్ చెయ్యగా కేవలం ఈ రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 10.8 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే ఈ ఆదివారం వసూళ్లతో డెఫినెట్ గా ఈ చిత్రం లాభాల్లోకి వెళ్లిపోవడం గ్యారెంటీ అని చెప్పాలి. మొత్తానికి అయితే బింబిసార తో టాలీవుడ్ లో మళ్ళీ పూర్వ వైభవం వచేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు