లేటెస్ట్ : ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటున్న ‘లియో’ కన్నడ పోస్టర్

Published on Sep 18, 2023 9:00 pm IST

ఇళయదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ లియో. ఈమూవీ లో విజయ్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈమూవీ పై అన్ని భాషల ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే యుకె లో ఈ మూవీ ప్రీ బుకింగ్స్ లో అదరగొడుతోంది. విషయం ఏమిటంటే, నిన్న తెలుగు మూవీ పోస్టర్ ని రిలీజ్ చేసిన లియో టీమ్ నేడు కన్నడ పోస్టర్ ని రిలీజ్ చేసారు. KEEP CALM AND PLOT YOUR ESCAPE (ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఎస్కేప్‌ను ప్లాన్ చేయండి) అనే కాన్సెప్ట్ తో గన్ పై హీరో విజయ్ పిక్ ఉన్న పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 19న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :