లేటెస్ట్ : భారీ ధరకు మహేష్ 28 ఆడియో రైట్స్ ?

Published on Mar 25, 2023 10:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ తాజా సినిమా SSMB 28 పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ మూవీ యొక్క ఓటిటి హక్కులని ఇప్పటికే ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ రూ. 81 కోట్లకు దక్కించుకోగా తాజా టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఏకంగా రూ. 27 కోట్లకు ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆడియో సేల్స్ లో ఇది టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ రికార్డు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ దీనిపై యూనిట్ నుండి మాత్రం అధికారికంగా న్యూస్ బయటకు రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :