సూపర్ స్టార్ న్యూ లుక్…వైరల్ అవుతోన్న ఫోటో!

Published on Jun 13, 2022 12:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం సర్కారు వారి పాట సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో కలిసి సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. నమ్రతా శిరోద్కర్, గౌతమ్ మరియు సితారతో కలిసి అతని సెల్ఫీని పోస్ట్ చేయడం జరిగింది.

ఈ చిత్రంలో మహేష్ లైట్ బియర్డ్ తో చాలా అందంగా కనిపిస్తున్నాడు. అతను ఇలా వ్రాసాడు, రోడ్ ట్రిప్ ఇట్స్, నెక్స్ట్ స్టాప్ ఇటలీ, లంచ్ విత్ ది క్రేజీస్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్క్ ఫ్రంట్‌లో, మహేష్ బాబు తదుపరి దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నారు. అతను దర్శక దిగ్గజం రాజమౌళితో కూడా ఒక సినిమాని కలిగి ఉన్నాడు, ఈ సంవత్సరం చివరిలో దాని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

సంబంధిత సమాచారం :