లేటెస్ట్ : పోలీస్ కేసు ఫైల్ చేసిన ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్

Published on Sep 16, 2023 6:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య, సునీల్ వంటి వారు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

అయితే ఈ మూవీ నుండి నిన్న ఏకంగా ఒక లిరికల్ సాంగ్ ఇంటర్నెట్ లో లీక్ అయి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దానితో ఒక్కసారిగా గేమ్ ఛేంజర్ టీమ్ షాక్ కి గురయింది. కాగా తాజాగా ఆ లీక్ పై మూవీ మేకర్స్ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమ సినిమా నుండి లీక్ అయిన సాంగ్ ఎవరి వలన బయటకు వచ్చింది, అలానే దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్మాత దిల్ రాజు తన ఫిర్యాదులో పోలీసులని కోరారు.

మొత్తంగా గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎందరో వేలమంది శ్రమ పడి వర్క్ చేసే సినిమాల నుండి ఈ విధంగా లీక్స్ రావడం బాధాకరం అని, ఇకపై ఇటువంటివి జరుగకుండా సినిమా పరిశ్రమ వారు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సినీ విశ్లేషకులు కోరుతున్నారు.

సంబంధిత సమాచారం :