లేటెస్ట్ : మెగాహీరో మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు

Published on Mar 15, 2023 8:08 pm IST

ఉప్పెన మూవీతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ దానితో పెద్ద విజయం అందుకున్నారు. ఆ తరువాత కొండపొలం, రంగరంగ వైభవంగా మూవీస్ తో మరొక రెండు సక్సెస్ లు అందుకున్నారు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ మూవీలో కీలకమైన చెంగా రెడ్డి పాత్రలో మలయాళ నటుడు జోజు జార్జ్ నటిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇటీవల ఇరట్టా మూవీతో సూపర్ హిట్ అందుకున్న జోజు జార్జి ఈ మూవీతో తొలిసారిగా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వేసవి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :