లేటెస్ట్..హీరో మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్.!

Published on Dec 29, 2021 2:00 pm IST

మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆల్రెడీ రెండు సార్లు చాలా నష్టపోయారు అంతా. మరి ఈ కరోనా బారి నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండే అనేక మంది సినీ తారలు కూడా తప్పించుకోలేకపోయారు. మరి ఈరోజు మన టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో మంచు మనోజ్ తాను కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యినట్టు తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసాడు.

అయితే తనని గత కొన్ని రోజుల్లో కలిసిన వారు అంతా టెస్ట్ చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. అలానే తన గురించి ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని మనోజ్ తెలిపాడు. అలాగే తనకి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్ లు మరియు నర్స్ లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మనోజ్ తెలిపాడు. మరి మనోజ్ త్వరగా కోలుకోవాలని మా 123 యూనిట్ కోరుకుంటుంది. ఇక నుంచి అయినా మళ్ళీ అంతా తగు జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే మంచిది.

సంబంధిత సమాచారం :