లేటెస్ట్ : నటుడు చంద్రమోహన్ కు పలువురు నటుల నివాళి

Published on Nov 11, 2023 3:05 pm IST

టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన విలక్షణ నటుడు చంద్రమోహన్ నేడు ఉదయం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హఠాన్మరణంతో ఒక్కసారిగా చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. టాలీవుడ్ ఒక అద్భుత నటుడిని కోల్పోయింది అంటూ పలువురు సినీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా చంద్రమోహన్ గారికి తమ నివాళిని అందిస్తూ మెసేజెస్ చేస్తున్నారు.

మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నటులు అయిన మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజా రవితేజ, నాచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, కె రాఘవేంద్రరావు తమకు చంద్రమోహన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరారు. అలానే పలువురు నటీనటులు చంద్రమోహన్ ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఎల్లుండి హైదరాబాద్ లో చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

సంబంధిత సమాచారం :