“వాల్తేరు వీరయ్య” పై లేటెస్ట్ ‘మాస్’ ఇన్ఫో.!

Published on Dec 1, 2022 2:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న మాస్ మసాలా చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి వింటేజ్ బాస్ అంటూ ఊరిస్తూ వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మరో స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరి దీనితో మరిన్ని అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఆల్రెడీ సాలిడ్ ట్రీట్ ని సినిమా టైటిల్ టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ లతో అందుకోగా ఇక ఇప్పుడు మాస్ మహారాజ రవితేజపై ఇంట్రెస్టింగ్ ట్రీట్ ని ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

నిజానికి కాస్త ముందే రావాల్సి ఉన్న ఈ ట్రీట్ ని మేకర్స్ నెక్స్ట్ వీక్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రంలో రవితేజ పాత్రని పరిచయం చేస్తూ ఓ అనౌన్సమెంట్ టీజర్ ని వదలబోతున్నట్టుగా ఇప్పుడు టాక్. మరి దీనిపై అయితే అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :