నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “అఖండ” తర్వాత తన కెరీర్ లో 107వ సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ భారీ యాక్షన్ డ్రామా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ జూన్ లో బాలయ్య బర్త్ డే ఉండడంతో ఒక మాసివ్ అప్డేట్ అయితే ఈ సినిమాపై ఉంటుంది అని గట్టి టాక్ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది.
అయితే ఈ బజ్ ని నిజం చేస్తూ మేకర్స్ ఒక అదిరే అప్డేట్ ని ప్రీ లుక్ పవర్ ఫుల్ పోస్టర్ తో అందించారు. బాలయ్య ఫస్ట్ హంట్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకి ఆల్రెడీ “అన్నగారు”, “జై బాలయ్య” అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఏది అనౌన్స్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Simham veta ki sidham ????#NBK107 First Hunt Loading ????????
NATASIMHAM #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @OfficialViji @varusarath5 @MusicThaman pic.twitter.com/RFB8KgtMAr
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2022