లేటెస్ట్ : “ఎన్టీఆర్ 30” నుంచి మాసివ్ అప్డేట్.!

లేటెస్ట్ : “ఎన్టీఆర్ 30” నుంచి మాసివ్ అప్డేట్.!

Published on Nov 20, 2022 12:46 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు నటించిన తన కెరీర్ 30వ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి జస్ట్ అనౌన్సమెంట్ తోనే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివ అయితే నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించనున్నారు.

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే ఈ చిత్రం పై పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు అప్డేట్ ఇవ్వగా ఇప్పుడు మాసివ్ అప్డేట్ ని అయితే మేకర్స్ అందించారు.

ఈ సినిమాకి అభిమానుల కోరికతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని తీసుకోగా తాను కూడా ఈ సినిమా ఫస్ట్ మోషన్ పోస్టర్ టీజర్ అదిరిపోయే స్కోర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అయితే మళ్ళీ తాను అలాగే కొరటాల శివ మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నట్టుగా మేకర్స్ కొన్ని ఫోటోలు రిలీజ్ చేసి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ లు మంచి కేజ్రీగా మారాయి. దీనితో తారక్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైటెడ్ గా ఫీలవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు