“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ.!

Published on Mar 21, 2023 1:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలా కాలం తర్వాత చేస్తున్న అవైటెడ్ సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” చిత్రం కోసం తెలిసిందే. జాతి రత్నాలు ఫేమ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో స్పెషల్ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే ఒకో అప్డేట్ తో మంచి ఆసక్తి రేపుతూ ఉండగా లేటెస్ట్ గా అయితే సినిమా ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ని అయితే అందించారు.

మరి ఫస్ట్ సింగిల్ గా “నో నో నో” అంటూ ఫస్ట్ సింగిల్ ని రేపు ఉగాది కానుకగా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి వాట్సాప్ చాట్ లాంటి ఇంట్రెస్టింగ్ వీడియో చేసి తెలిపారు. మరి ఈ సాంగ్ కి అయితే టైం ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది. మరి ఈ సినిమాకి రాధన్ సంగీతం అందిస్తుండగా ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా అతి త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :