లేటెస్ట్ : నాని ‘దసరా’ నుండి నాలుగవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 27, 2023 11:08 pm IST

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ వ్యయంతో నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మార్చి 30న గ్రాండ్ గా పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో ఈ పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ కానుంది.

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ మూవీగా రూపొందిన దసరా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ఆడియన్స్ ని ఆకట్టుకోగా ఈ మూవీ నుండి ఓ అమ్మలాలో అమ్మలాలో అనే పల్లవితో సాగే నాలుగవ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం హీరో నాని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అనౌన్స్ చేసారు. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ప్రస్తుతం టికెట్ ప్రీ బుకింగ్స్ లో కూడా అదరగొడుతోంది.

సంబంధిత సమాచారం :