టాలీవుడ్ ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా మంచి డెబ్యూ హిట్ ని అందుకొని తనదైన ముద్ర టాలీవుడ్ లో వేసాడు. అలా స్వాతి ముత్యం తో ఆడియెన్స్ ని అలరించిన ఈ యంగ్ హీరో నెక్స్ట్ చేసిన ఇంట్రెస్టింగ్ చిత్రమే “నేను స్టూడెంట్ సర్”. కొత్త దర్శకుడు రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించిన ఈ చిత్రం కొన్నాళ్ల కితం వచ్చిన టీజర్ తో అయితే బాగా ఇంప్రెస్ చేసింది.
దీనితో మంచి థ్రిల్ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ డేట్ ని అయితే లాక్ చేసుకున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మార్చ్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనిపై మేకర్స్ రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ గా అవంతిక నటించగా సముద్రఖని తదితరులు నటించారు. అలాగే మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాని ఎస్ వి 2 ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.