లేటెస్ట్..”నేను స్టూడెంట్ సర్” రిలీజ్ వాయిదా.!

Published on Feb 27, 2023 3:30 pm IST

స్వాతి ముత్యం అనే సినిమాతో డీసెంట్ డెబ్యూ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నటుడుగా మంచి మార్కులు అందుకున్నాడు. ఇక నెక్స్ట్ హీరోగా తాను చేసిన లేటెస్ట్ చిత్రం “నేను స్టూడెంట్ సార్”. దర్శకుడు రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించిన ఈ సినిమా మంచి థ్రిల్లర్ గా తెరకెక్కగా ఆ మధ్య వచ్చిన టీజర్ తో సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. దీనితో మేకర్స్ రీసెంట్ గానే మార్చ్ 10 రిలీజ్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు అయితే మేకర్స్ అనూహ్యంగా సినిమా రిలీజ్ ని వాయిదా వేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. కొత్త డేట్ ని అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ సినిమాని అయితే వేసబి సెలవులు కానుకగా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు. దీనిపై రానున్న రోజుల్లో అయితే క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో అవంతిక హీరోయిన్ గా నటిస్తుండగా మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎస్ వి 2 ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :