అజిత్ నెక్స్ట్ మూవీ బ్యాక్‌డ్రాప్ రివీల్?

Published on Mar 8, 2022 8:30 pm IST


అజిత్ కుమార్ చివరిగా నటించిన వలిమై చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద పని అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు అదే దర్శకుడు హెచ్ వినోద్ మరియు నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు అజిత్. ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని, ఈ చిత్రంలో అజిత్ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని తెలిసింది.

దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు ఈ చిత్రంలో ప్రధాన విలన్‌లలో ఒకరిగా నటించడానికి చర్చలు జరుపుతున్నారు మేకర్స్. కొద్ది రోజుల క్రితం అజిత్ తెల్ల గడ్డంతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ సినిమా బజ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :