బాలయ్య సినిమా ప్లాన్ ప్రకారమే పూర్తవుతుందా ?

Published on Jan 3, 2022 8:02 pm IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఫిబ్రవరి నుంచి స్క్రిప్ట్‌ వర్క్‌ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క కరోనా మూడో వేవ్ తన ప్రభావం చూపించడానికి సిద్ధంగా ఉంది. అసలు ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు.

మరి ఈ నేపథ్యంలో ‘బాలయ్య – అనిల్ రావిపూడి’ సినిమా ప్లాన్ ప్రకారం పూర్తి చేసుకుని రిలీజ్ అవుతుందా ? చూడాలి. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో కామెడీ డోస్ బాగా ఉంటుందట.

సంబంధిత సమాచారం :