అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడ ఒకటి. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే బంగార్రాజు సినిమాను సంక్రాంతికి విడుదల అనుకున్నారు. కానీ బంగార్రాజు సంక్రాంతికి వచ్చేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం నాగ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు-2తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎలాగూ బిగ్ బాస్-3 కోసం నాగ్ మూడు నెలల పాటు బిజీ అవ్వనున్నాడు. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. ఇక వచ్చే ఏడాదే వేసవిలోనే బంగార్రాజు విడుదల ఉండొచ్చు.