RRR కోసం మొత్తం స్క్రీన్‌ని బుక్ చేసిన ఎన్టీఆర్

RRR కోసం మొత్తం స్క్రీన్‌ని బుక్ చేసిన ఎన్టీఆర్

Published on Mar 23, 2022 6:00 PM IST


నాలుగేళ్ల తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ తెరపై కనిపించ నున్నాడు. కాబట్టి, అతని పునరాగమనం గురించి క్రేజీ ఎగ్జైట్మెంట్ ఉంది మరియు అభిమానులు ఈ విషయం లో ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ కి క్రేజీ ప్రమోషన్స్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ మల్టీప్లెక్స్‌లో ఎన్టీఆర్ మొత్తం స్క్రీన్‌ను బుక్ చేసుకున్నారని మరియు తన సన్నిహిత కుటుంబ సభ్యుల కోసం RRR షోను హోస్ట్ చేస్తారనే సమాచారం.

హైదరాబాద్‌లో ఫ్యాన్స్ షోలు, ప్రీమియర్‌ల గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి కాని ఇంకా ఏదీ ధృవీకరించబడలేదు. తెలంగాణలో RRR ప్రారంభ ప్రదర్శనలు తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం స్పెషల్ షో పర్మిషన్లు ఇచ్చింది మరియు RRR కోసం రోజుకు ఐదు షోలు ఉంటాయి. కాబట్టి, స్పెషల్ మరియు ఫ్యాన్స్ షోల వివరాలు రేపు బయటకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు