ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

Published on Nov 9, 2021 7:09 pm IST


జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. కొరటాల శివ తో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది అనే దాని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కొరటాల శివ మరియు ఎన్టీఆర్ కాంబో లో వస్తున్న ఈ సినిమా కి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించనున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. మరొక హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సైతం ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :