పవన్ “హరిహర వీరమల్లు” షూట్ మళ్ళీ మొదలయ్యేది అప్పుడే!

Published on Oct 5, 2021 3:30 pm IST

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా, ఇంకా కొంత భాగం చిత్రీకరించాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది అనే దాని పై ఒక క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం తిరిగి రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెల రెండవ వారం లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. భీమ్లా నాయక్ అనంతరం ఇటు క్రిష్ చిత్రం తో పాటుగా, హరీశ్ శంకర్ దర్శకత్వం లో మరొక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. భవదీయుడు భగత్ సింగ్ పేరిట ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :