ప్రభాస్ “సలార్” యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే..!

Published on Jul 2, 2022 12:30 am IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సిరీస్ చిత్రాల సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ప్రభాస్ కి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం కో శృతి హాసన్ కథానాయిక గా నటిస్తుంది. ప్రభాస్ సలార్ తో పాటుగా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే చిత్రాలతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :