“పుష్ప ది రూల్” స్పీడ్ గా చేయమని సుకుమార్ ను కోరిన బన్నీ?

Published on Jun 8, 2022 11:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన గత చిత్రం పుష్ప ది రైజ్ సూపర్ సక్సెస్‌తో తన గేమ్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు, పుష్ప ది రూల్ ఎప్పుడు ఫ్లోర్‌పైకి వెళ్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప మొదటి భాగం విడుదలై నాలుగు నెలలు దాటింది. కానీ, సీక్వెల్ చిత్రీకరణకు సంబంధించిన సంకేతాలు లేవు.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్ ప్రకారం, సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని బన్నీ సుకుమార్‌ను కోరినట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా సినిమాను పూర్తి చేసి, 2023 వేసవిలో పుష్ప 2ని విడుదల చేయాలని బన్నీ భావిస్తున్నాడు. సీక్వెల్ కోసం కొంతమంది పెద్ద పేర్లను ఎంపిక చేస్తున్నారు మరియు ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :