లాంగ్ రన్ టైం తో రానున్న సూపర్ డీలక్స్ !

త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి,సమంత ,రమ్యకృష్ణన్ , ఫహద్ ఫాజిల్ , మిస్కిన్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం సూపర్ డీలక్స్. కాగా ఈచిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించనుండగా రమ్యకృష్ణన్ శృంగార తార గా నటించింది. ఇక ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని విడుదల సిద్ధమైంది. ఏ సర్టిఫికెట్ తో రానున్న ఈ చిత్రం యొక్క నిడివి 2గంటల 55 నిమిషాలని సమాచారం.

డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈచిత్రం మార్చి 29 న విడుదలకానుంది. ఇక ఈ సినిమా అదే రోజున తెలుగులోనూ విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సివుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version