చైతు భారీ సినిమా ‘వృష కర్మ’ పై లేటెస్ట్ న్యూస్!

VRUSHAKARMA

అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న భారీ చిత్రం “వృష కర్మ” కోసం అందరికీ తెలిసిందే. విరూపాక్ష తో సత్తా చాటిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమాని అంతకు మించిన అడ్వెంచర్ థ్రిల్లర్ మిస్టరీగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

యువ హీరో నాగ చైతన్య లేటెస్ట్ ఇంటరాక్షన్ లో ఈ సినిమా షూటింగ్ 85 శాతం పూర్తయ్యినట్టు కన్ఫర్మ్ చేసాడు. మిగతాది కూడా త్వరలోనే కంప్లీట్ కానుంది. సో ఈ సినిమా విడుదలకి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా విరూపాక్ష నిర్మాణ సంస్థ అధినేత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో అత్యున్నత ప్రమాణ విలువలు సెట్ చేసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version