లేటెస్ట్..ఏపీ ఆన్లైన్ సినిమా టికెటింగ్ కి గ్రీన్ సిగ్నల్.?

Published on May 6, 2022 10:11 am IST

గత ఏడాది నుంచి ఏపీలో సినిమా కి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయో చూస్తూనే ఉన్నాము. టికెట్ ధరలకు సంబంధించి గాని ఇతర కొన్ని అంశాలపై మాత్రం పలు సినిమాలకు ఇబ్బందులు తప్పలేదు. దీనితో తెలుగు సినిమా పెద్దలు కదిలి వెళ్లి మళ్ళీ మంచి పరిస్థితితులు తెచ్చుకోగలిగారు.

అయితే ఆ మధ్య ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్లు ఆన్ లైన్ విక్రయానికి సంబంధించి ప్రభుత్వమే ఒక పారదర్శక ఆన్లైన్ పోర్టల్ ని తీసుకు వస్తుంది అని తెలిపారు. దానికి అప్పుడు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది.

ఏపీలో ప్రభుత్వం ద్వారా సినిమా టికెట్లు విక్రయించుకోవచ్చని హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందో ఏ సినిమా తో మొదలవుతుందో ఇతర నిబంధనలు ఏమిటి అనేవి ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :