సీఎం గా కనిపించబోతున్న బాలయ్య ?

సీఎం గా కనిపించబోతున్న బాలయ్య ?

Published on Dec 12, 2022 2:00 PM IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అయితే, ఇప్పుడు పరుశురామ్ తన తర్వాత సినిమాని బాలయ్య బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బాలయ్య – పరుశురామ్ సినిమాకి సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో బాలయ్య సీఎం గా కనిపించబోతున్నాడట. బాలయ్య క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. మొత్తానికి పరుశురామ్ – బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అనిల్ – బాలయ్య సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత.. పరుశురామ్ – బాలయ్య సినిమా స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు