చలపతిరావు గారి అంత్యక్రియలపై తాజా సమాచారం.!

చలపతిరావు గారి అంత్యక్రియలపై తాజా సమాచారం.!

Published on Dec 25, 2022 9:00 AM IST

జస్ట్ కొన్ని రోజులు కితమే తెల్లవారుతూనే దిగ్గజ నటులు కైకాల సత్యన్నారాయణ గారు లేరు అనే వార్తా గాయం తెలుగు సినిమా పట్ల ఇంకా పచ్చిగానే ఉండగానే మళ్ళీ ఈరోజు ఉదయం ప్రముఖ నటులు చలపతిరావు గారు మరణించారన్న వార్త షాకింగ్ గా మారింది. దీనితో ఒక్కసారిగా తెలుగు సినిమా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరి ఈ వార్తతో వారి ఇంట తీవ్ర విషాదం నెలకొనగా ఇప్పుడు వారి అంత్యక్రియలకు సంబంధించి తాజా సమాచారం అయితే వచ్చింది.

మరి ఆయన పార్థివదేహాన్ని అయితే హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో తన కుమారుడు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ రవి బాబు ఇంట్లో ప్రస్తుతం ఉంచడం జరిగింది. మరి తరువాత ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహా ప్రస్థానానికి పార్థివ దేహాన్ని చేర్చి ఫ్రీజర్ లో ఉంచడం జరుగుతుంది. అయితే చలపతిరావు గారి కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. ఆమె ఈ బుధవారానికి చేరుకుంటారు. దీనితో తాను రాగానే మహాప్రస్థానం లో చలపతిరావు గారికి అంతిమ వీడ్కోలు కుటుంబీకులు సినీ ప్రముఖులు అందివ్వనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు