గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్ర క్లైమాక్స్ లో వస్తోందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఓ సీనియర్ బాలీవుడ్ హీరోని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. మరి ఏ హీరో ఈ పాత్రలో కనిపిస్తాడో చూడాలి.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే.. ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్ లో హీరో ఛాంపియన్ అవుతాడని.. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందట. బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట.
కాగా ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.
