గేమ్ చేంజర్ లో నేనో హీరోయిన్‌ – అంజలి

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ అంజలి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఐతే, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రమోషన్స్ లో అంజలి ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా గురించి కూడా స్పందించారు. ‘‘గేమ్‌ ఛేంజర్‌లో నేను కీ రోల్‌కే పరిమితం కాదు. అందులో నేనో హీరోయిన్‌. కానీ ఈ సినిమాలో నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తానని వార్తలు రాస్తున్నారు. నా పాత్ర గురించి మేకర్స్‌ అలా ప్రకటించలేదు కదా. నా పాత్రకు సంబంధించి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌, ఓ అందమైన పాట ఉంటాయి. ఇంతకుమించి నేను ఏం చెప్పలేను’’ అంటూ అంజలి చెప్పుకొచ్చింది.

కాగా ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన తర్వాత, రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. అందుకే, శంకర్ కూడా చరణ్ సినిమాని ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు.

Exit mobile version