అప్పుడు మహేష్.. ఇప్పుడు పవన్ ?

Published on Sep 4, 2023 9:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొంతు వినబడబోతుందని టాక్. గతంలో పవన్ ‘జల్సా’ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ ‘గుంటూరు కారం’ సినిమా నడుస్తుంది. కథ పరంగా నేపథ్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే.. పవన్ ఆ నేపథ్యం గురించి చెబుతూ కథలోకి తీసుకువెళ్తే సినిమాకి ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ ఫీల్ అయ్యాడట.

త్రివిక్రమ్ ప్లాన్ ప్రకారమే పవన్ ‘గుంటూరు కారం’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించాడు అని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా… ఫ్యాన్స్ కి పండగే. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే స్థానంలో తీసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. జ‌న‌వ‌రి 13, 2024న రిలీజ్ ఈ సినిమా కానుంది.

సంబంధిత సమాచారం :