క్రేజీ సాంగ్ కు ‘వీరమల్లు’ కసరత్తులు !

క్రేజీ సాంగ్ కు ‘వీరమల్లు’ కసరత్తులు !

Published on Mar 12, 2023 6:41 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ క్రేజీ సాంగ్ ను షూట్ చేయడానికి ప్రస్తుతం భారీ సెట్ వేస్తున్నారు. ఈ నెల నాలుగో వారానికి ఈ సెట్ పూర్తి అవుతుందని.. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఈ సాంగ్ ను షూట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు