స్పెషల్ సాంగ్ షూట్ లో ‘వార్ 2’ ?

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ స్పెషల్ సాంగ్ చేస్తోందని సమాచారం. ఈ సాంగ్ లో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ ఇద్దరూ కనిపిస్తారని.. ఇదొక పబ్ సాంగ్ అని, బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని సీన్స్ కూడా రన్ అవుతాయని టాక్. ఊర్వశి రౌతేలా ఇప్పటికే వాల్తేరు వీరయ్య, అఖిల్ ఏజెంట్‌లో ప్రత్యేక పాటలు చేసింది.

ఏది ఏమైనా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version