‘మహేష్ – రాజమౌళి’ సినిమా పై కీరవాణి కామెంట్స్

‘మహేష్ – రాజమౌళి’ సినిమా పై కీరవాణి కామెంట్స్

Published on Jun 23, 2024 6:00 PM IST

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌ తో తెరకెక్కనున్న మూవీ పై సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తాజాగా ఇచ్చిన అప్‌డేట్ వైరల్ అవుతుంది. ఇంతకీ, కీరవాణి ఏం చెప్పారంటే ?.. ‘నేనిప్పటి వరకూ ఈ సినిమా సంగీత పనులు ప్రారంభించలేదు. ఎందుకంటే ఈ వారమే స్టోరీ లాక్‌ అయింది. టెస్ట్‌ షూట్స్‌ జరుగుతున్నాయి. జులై లేదా ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తా’’ అని చెప్పారు.

కాగా ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ సినిమాలో మాత్రం మహేష్ సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట. సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో మహేష్ లుక్ ఉంటుందట. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు